Tata Solar Power : టాటా సోలార్ పవర్ .. ఐసీఐసీఐతో ఒప్పందం

X
By - Manikanta |24 Aug 2024 4:45 PM IST
టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ నివాస, కార్పొరేట్ వినియోగదారులకు సోలార్ ప్యానెల్స్/యూనిట్ల కొనుగోలు కోసం రుణాలు అందించడానికి ఐసీఐసీఐ బ్యాంకుతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందంలో భాగంగా, వినియోగదారులు 5 ఏళ్ల వరకు పూచీకత్తు లేకుండా రూ.90 లక్షల వరకు రుణాలను పొందొచ్చు. అంతకంటే అధిక రుణాల కోసం పూచీకత్తుతో 20 ఏళ్ల వరకు కాలపరిమితి పొందొచ్చు. టీపీ ఎస్ఎస్ఎల్, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్‌కు సంబంధించిన యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. వినియోగదారులు తమ రుణ మొత్తంలో 20-25 శాతం వరకు ఫ్లెక్సిబుల్ డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను పొందవచ్చు. టాటా పవర్‌కు సంబంధించిన విభాగమైన టీపీఆర్ఈఎల్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ డెవలపర్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com