Telangana IB officer : మృతుల్లో తెలంగాణ ఐబీ అధికారి.. ఫొటో వైరల్

జమ్ము కాశ్మీర్ లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో తెలంగాణకు చెందిన పోలీసు అధికారి మృతి చెందారు. బీహార్ కు చెందిన మనీష్ రంజన్ నగరంలోని కోఠి ఎస్ఎస్ఐబీలో స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సదరు ఐబీ ఆఫీసర్ తన భార్య ఇద్దరు పిల్లలతో టూర్ కు వెళ్లారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో తన వద్ద ఉన్న ఇంటెలిజెన్స్ విభాగ స్పెషల్ అఫీసర్ ఐడీ కార్డును మనీష్ వారికి చూపించాడు. దీంతో వెంటనే ముష్కరులు భార్యా, పిల్లల ఎదుటే ఆయనపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన మనీష్ రంజన్ అక్కడికక్కడే మరణించారని, అయితే ఆయన భార్య, పిల్లలను మాత్రం హెచ్చరించి వదిలేశారని అధికారులు పేర్కొన్నారు. మనీష్ మృతి చెందినట్లు సమాచారం అందుకున్న రాష్ట్ర పోలీసులు ఒక బృందాన్ని హుటాహుటిన జమ్మూ కాశ్మీరు పంపినట్లు సమాచారం. మృతుడు మనీష్ రంజన్ రే కుటుంబ సభ్యులను సురక్షితంగా హైదరాబాద్ కు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు డీజీపీ జితేందర్ ఆదేశాలిచ్చారు. మనీష్ పక్కనే ఆయన భార్య విలపిస్తున్న ఫొటో వైరల్ అయింది. సహనం అని భారత ప్రభుత్వం ఇంకా చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదని.. ప్రతీకార దాడి చేయాలని జనం, నెటిజన్లు కోరుతున్నారు. పోస్టులను వైరల్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com