SBI MD : స్టేట్ బ్యాంక్ ఎండీగా తెలుగుతేజం నియామకం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా అమర రాంమోహన్ రావును కేంద్రం నియమించింది. ఎస్బీఐలో ఎండీగా కొనసాగిన సీఎస్ శెట్టి గత ఆగస్టులో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడంతో ఆ స్థానంలో రాంమోహన్రావు అమరను ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారసు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ కమిటీ ఆమోదించింది. సీఎస్ శెట్టి స్థానంలో రాంమోహన్రావును ఎండీగా నియమించాలని సెప్టెంబర్ ఎఫ్ఎస్ఎస్ఐబీ సిఫారసు చేసింది. ప్రస్తుతం రాంమోహన్ రావు ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలతోపాటు చీఫ్ రిస్క్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అమర రాంమోహన్ రావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల. 1991లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అమర రాంమోహన్రావు ప్రొబేషనరీ ఆఫీసర్ చేరారు. ఎస్బీఐలో ఫీల్డ్, క్రెడిట్, రిస్క్, రిటైల్ తదితర విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. అంతేగాక అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై అపార అనుభవం సంపాదించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com