వినియోగదారులకు ఊరట : ఉల్లి ఎగుమతులపై నిషేధం..

వినియోగదారులకు ఊరట : ఉల్లి ఎగుమతులపై నిషేధం..
ఉల్లిపాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక..

ఉల్లిపాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర వాణిజ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఉల్లి ఎగుమతి నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. తాము చెప్పేంత వరకు ఉల్లి ఎగుమతులు నిలిపివేయాలని ఆ ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

అతిపెద్ద ఉల్లి ఎగుమతిదారుగా భారత్ ఉంది. దక్షిణాసియా దేశాల వంటకాల్లో ఉల్లిపాయలను ప్రధానంగా వాడతారు. బంగ్లాదేశ్, నేపాల్‌, మలేషియా, శ్రీలంక తదితర దేశాలకు భారత్ నుంచే ఉల్లి ఎగుమతి అవుతోంది. దేశీయ అవసరాలకు సరిపడా ఉల్లి నిల్వల కోసం కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల వాణిజ్య కేంద్రమైన లాసల్‌గావ్‌లో నెల వ్యవధిలోనే టన్ను ఉల్లిపాయల ధర మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఈ మార్కెట్‌లో టన్ను ధర 30 వేలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి ధర ప్రస్తుతం 40గా ఉంది. అయితే.. ఇటీవల కురిసిన వర్షాలతో వేలాది ఎకరాల్లో ఉల్లి పంట దెబ్బతింది. మిగతా రాష్ట్రాల్లో కోత ఆలస్యం కానుంది. దీంతో ఉల్లి సరఫరా పడిపోయింది. దీని ఫలితంగా నెల వ్యవధిలోనే ఉల్లి ధర మూడు రెట్లు పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story