Military Training: పహల్గామ్ ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లో సైనిక శిక్షణ

మినీ స్విట్జర్లాండ్”గా పిలువబడే బైసారన్ లోయలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక నేపాలీ జాతీయుడితో సహా ఇరవై ఆరు మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ ఘోరమైన కాల్పులకు పాల్పిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉన్నత సైనిక శిక్షణ పొందారని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి ఈ శిక్షణ వారు జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొనింది. ఇప్పటికే జైలులో ఉన్న కొంతమంది ఉగ్రవాదులను విచారించినప్పుడు ఈ సమాచారాన్ని బయట పెట్టారని అధికారులు తెలిపారు.
కాగా, పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరైన హషీమ్ ముసా గతంలో పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో పారా-కమాండోగా పని చేశాడు. తరువాత అతను లష్కరే తోయిబాలో చేరాడు. ఇక, అప్పటి నుంచి అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నాడు. అయితే, 2023లో భారతదేశంలోకి ప్రవేశించినట్లు తెలిసింది.. అప్పటి నుంచి అతను జమ్మూ కాశ్మీర్ అంతటా జరిగిన ఆరు ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నట్లు తేలింది. గత ఏడాది అక్టోబర్లో గండేర్బల్ జిల్లాలో జరిగిన దాడిలో ఏడుగురు, బారాముల్లాలో జరిగిన దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది మరణించారు.
అయితే, దక్షిణ కాశ్మీర్ అడవుల్లో హషీమ్ మూసా ఎక్కడో దాక్కున్నాడని భారత భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అతడ్ని పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆ ఉగ్రవాది గురించి ఏదైనా సమాచారం ఇచ్చిన వారికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు రూ. 20 లక్షల బహుమతిని ప్రకటించారు. అలాగే, సమాచారం ఇచ్చేవారి గుర్తింపును గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. పాకిస్తాన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన ముసాతో సహా అందరు ఉగ్రవాదులు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లేదా హిజ్బుల్ ముజాహిదీన్‌లలో ప్రస్తుతం పని చేస్తున్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com