Thamilanadu: గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్

తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి.మళ్లీ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ రగడ మొదలైంది.కేబినెట్ మంత్రిని గవర్నర్ డిస్మిస్ చేయడంపై సీఎం స్టాలిన్ సీరియస్ అవుతున్నట్లు తెలుస్తుంది.ఒక కేబినెట్ మంత్రిని డిస్మిస్ చేసే అధికారం గవర్నర్‌కు ఎక్కడిదంటూ ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకుంటామని అల్టీమేటం ఇచ్చారు.కేవలం నేరారోపణలు ఉన్నంత మాత్రాన కేబినెట్ నుంచి గవర్నర్ ఎలా తొలగిస్తారని స్టాలిన్ అంటున్నారు. మనీ లాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయనను గవర్నర్ డిస్మస్ చేశారు. సెంథిల్ బాలాజీ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
మరోవైపు డీఎంకే కార్యకర్తలు గవర్నర్‌కు వ్యతిరేకంగా చెన్నైలో భారీగా పోస్టర్లను వేశారు.పలు కేసులు ఎదుర్కొంటున్న మంత్రుల ఫోటోలను ఈ పోస్టర్లపై ప్రచురించారు.దమ్ముంటే కేంద్ర మంత్రులను డిస్మిస్ చేయాల్సిందిగా కేంద్రానికి గవర్నర్ లేఖ రాయాలని డీఎంకే కార్యకర్తలు డిమాండ్ చేశారు.మరోవైపు సీఎం స్టాలిన్ కు గవర్నర్ లేఖ రాశారు. సెంథిల్ వ్యవహారంలో అటార్నీజనరల్ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నామని అప్పటి వరకు మంత్రి మంత్రి భర్తరఫ్ సస్పెండ్‌లో ఉంచామని గవర్నర్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com