Center : జాతీయ భద్రతా సలహా బోర్డును రీవ్యాంప్ చేసిన కేంద్రం

Center :  జాతీయ భద్రతా సలహా బోర్డును రీవ్యాంప్ చేసిన కేంద్రం
X

జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్‌ అలోక్‌ జోషిని నియమించింది. ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్‌వ్యవస్థీకరించింది. సభ్యులుగా మాజీ ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఆర్మీ అధికారులను నియమించింది. ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలకు ఇప్పటికే భద్రత బలగాలకు ప్రధాని మోదీ సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తున్నట్లు చెప్పారు.

Tags

Next Story