Central : వచ్చే ఆరు నెలల్లో కేంద్రం రూ. 8 లక్షల కోట్లు అప్పు

కొత్త ఆర్ధిక సంవత్సరం 205-26లో తొలి 6 నెలల కాలంలో 8 లక్షల కోట్ల అప్పు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి సెక్యూరిటీల జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి మొత్తం 14.82 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవాలని బడ్జెట్ ప్రతిపాదించారు. ఇందులో తొలిగి నెలల కాలంలో 8 లక్షల కోట్లు అప్పు చేయనున్నారు. డేటెడ్ సెక్యూరిటీలతో పాటు 10 వేల కోట్ల విలువైన సావరిన్ గ్రీన్ బాండ్లు జారీ చేయనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్స రంలో ఆదాయ వసూళ్లు 34.96 లక్షల కోట్లు, నికర పన్ను ఆదాయం 28.37 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం 11.54 లక్షల కోట్లు మార్కెట్లో అప్పులు చేయాల్సి ఉంటుంది. దీనికి చిన్న పొదుపు మొత్తాలు, ఇతర మార్గాల ద్వారా కలిపి 14.82 లక్షల కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com