Maharashtra: తొమ్మిదేళ్ల క్రితం కిడ్నాప్ అయిన చిన్నారి.. సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరికి..

Maharashtra: ఏడేళ్ల వయస్సులో కిడ్నాప్‌కు గురైన బాలిక తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల వద్దకు చేరింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ముంబయిలోని అంధేరి ప్రాంతంలో ఉండే బాలిక పూజ.. 2013 జనవరి 22న అదృశ్యమైంది. సోదరుడితో పాటు స్కూల్‌కు వెళ్లిన బాలికను హారీ డిసౌజా అనే వ్యక్తి ఎత్తుకుపోయాడు. పిల్లలు లేకపోవడం వల్ల తాను పెంచుకోవాలని ఆమెను అపహరించాడు.
బడికి వెళ్లిన పాప ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల.. అంతా వెతికిన తల్లిదండ్రులు, బంధువులు స్థానిక డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించినా లాభం లేకపోయింది. ఇన్నేళ్ల తర్వాత యాదృచ్ఛికంగా పోలీసులకు కిడ్నాపర్ పట్టుబడ్డాడు. తొమ్మిదేళ్ల తర్వాత తమ చెంతకు చేరిన కూతురును చూసి తల్లి, కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com