Amit Shah : సిందూర్ ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసింది: అమిత్ షా

Amit Shah : సిందూర్ ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసింది: అమిత్ షా
X

ఆపరేషన్ సిందూర్ గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పహల్గాం ఘటనను ప్రస్తావించారు. "మన సోదరీమణులు, తల్లుల నుదుటి సిందూర రేఖ ప్రాధాన్యం ఇప్పుడు యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడుల తో దేశం గర్వపడేలా చేశాం. ఇది ప్రధాని మోడీకే సాధ్యం. మన దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూసేవాళ్లను తరిమికొట్టాం. వారిప్పుడు బాధగా మూలుగుతున్నారంటూ అమిత్ చెప్పారు. ప్రధాని మోడీ బలమైన రాజకీయ సంకల్పం, నిఘా సంస్థల కచ్చితమైన సమాచారం, త్రివిధ దళాల అద్భుత శౌర్యపరాక్రమాలతో ఇది సాధ్యమైంది. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయింది" అని చెప్పారు.

Tags

Next Story