India : భారత్ లో 463 మంది పాక్ ఖైదీలు

India : భారత్ లో 463 మంది పాక్ ఖైదీలు
X

భారత్ - పాకిస్తాన్.. ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. 2008లో అమల్లోకి వచ్చిన ద్వైపాక్షిక కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం.. ఖైదీలు, మత్స్యకారుల లిస్ట్ వెల్లడి న్యూఢిల్లీ - ఇస్లామాబాద్‌లోని దౌత్య మార్గాల ద్వారా ఏకకాలంలో జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. రెండు దేశాలు ప్రతి రెండేళ్లకు ఒకసారి జనవరి 1, జులై 1 తేదీలలో ఈ జాబితాలను పంచుకుంటాయి.

భారత కస్టడీలో 463 మంది ఖైదీలు :

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్.. 382 మంది పౌర ఖైదీలు, 81 మంది మత్స్యకారుల పేర్లను పాకిస్తాన్‌తో పంచుకుంది. వారు పాకిస్తాన్ జాతీయులుగా నిర్ధారించింది. ప్రతిగా పాకిస్తాన్ తన అదుపులో ఉన్న భారత్ కు చెందిన 53 మంది పౌర ఖైదీలు, 193 మంది మత్స్యకారులు వివరాలను పంచుకుంది.

పౌర ఖైదీలు ,మత్స్యకారులందరినీ స్వదేశానికి తిరిగి పంపించాలని భారత్ పాక్ ను డిమాండ్ చేసింది. ఇప్పటికే శిక్షలు పూర్తి చేసుకున్న 159 మంది భారతీయ ఖైదీల విడుదలను వేగవంతం చేయాలని దాయాది దేశాన్ని కోరింది. నిరంతర దౌత్య ప్రయత్నాల కారణంగా.. 2014 నుండి పాకిస్తాన్ నుండి మొత్తం 2,661 మంది మత్స్యకారులను, 71 మంది పౌర ఖైదీలను భారత్ విజయవంతంగా స్వదేశానికి రప్పించింది.

Tags

Next Story