Piyush Goyal : ట్రంప్‌ సుంకాలపై ప్రతీకార చర్యలు ఉండవు: పీయూష్ గోయల్

Piyush Goyal : ట్రంప్‌ సుంకాలపై ప్రతీకార చర్యలు ఉండవు: పీయూష్ గోయల్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25% సుంకాలు విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. అయితే, భారత్ వెంటనే అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో వెల్లడించారు. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని గోయల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులు, కార్మికులు, MSMEలు (సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు) ఇతర పారిశ్రామిక వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ట్రంప్ సుంకాలు విధించినప్పటికీ, భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇరు దేశాలకు లాభదాయకంగా, సమతుల్యంగా ఉండే ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, భారత్ తక్షణమే ప్రతీకార చర్యలు తీసుకోదు. ఈ విషయంలో 'నిశ్శబ్దం ఉత్తమ సమాధానం' అని ఒక ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానించారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది. • ట్రంప్ భారత్ ను చనిపోయిన ఆర్థిక వ్యవస్థ అని వ్యాఖ్యానించినప్పటికీ, గోయల్ భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, త్వరలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పారు. ఇది భారత్ ఆర్థికంగా ఎంత బలంగా ఉందో తెలియజేస్తుందన్నారు.

Tags

Next Story