Covid Symptoms In Kids: పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే.. కోవిడ్ అని అనుమానించాల్సిందే..

Covid Symptoms In Kids: పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే.. కోవిడ్ అని అనుమానించాల్సిందే..
X
Covid Symptoms In Kids: పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేదానిపై కూడా వైద్యులు ఇటీవల స్పష్టత ఇచ్చారు.

Covid Symptoms In Kids: కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో ఎక్కువగా వృద్ధులు, 20 ఏళ్లు పైబడిన వారికే కరోనా సోకేది. ముఖ్యంగా వృద్ధులను చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా సూచించారు. కానీ ఒమిక్రాన్ వేరియంట్ అనేది వచ్చిన తర్వాత వయసుతో సంబంధం లేకుండా చాలామంది కరోనా బారిన పడడం మొదలయ్యింది. అయితే ఈ సమయంలో పిల్లలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయని తెలుసుకోవడం ఎలాగో వైద్యులు చెప్తున్నారు.

మామూలుగా కొన్ని లక్షణాలు ఉండే అది కరోనా అని అనుమానించవచ్చని వైద్యులు ముందు నుండి చెప్తున్నారు. అందులో కామన్‌గా ఉన్న లక్షణాలు జలుబు, దగ్గు, గొంతుమంట, టేస్ట్ తెలియకపోవడం, జ్వరం లాంటి మరికొన్న లక్షణాలను వారు గుర్తించారు. అయితే రోజులు గడుస్తు్న్నకొద్దీ మరికొన్ని లక్షణాలు ఈ లిస్ట్‌లో చేరాయి.

బాడీ పెయిన్స్ కూడా కరోనాకు సంబంధించిన లక్షణమే అని వైద్యులు ఇటీవల నిర్దారించారు. ఇవన్నీ పెద్దవారిలో కనబడే లక్షణాలు. మరి పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేదానిపై కూడా వైద్యులు ఇటీవల స్పష్టత ఇచ్చారు. ఈమధ్య కరోనా బారిన పడిన పిల్లలను గమనించిన తర్వాత కడుపు నొప్పి, వాంతులు, జ్వరం.. ఈ మూడు పిల్లల్లో కనిపించే కరోనా లక్షణాలు అంటున్నారు వైద్యులు.

Tags

Next Story