Bharat Pol Portal : భారత్ పోల్ విశేషాలు ఇవే

కేసులు వేగంగా విచారణ జరిగేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త పోర్టల్ భారత్ పోల్ ను హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. అంతర్జాతీయ కేసుల వివాదంలో సరికొత్త శకం ప్రారంభమైనట్టేనని చెప్పారు. ఈ పోర్టల్ విశేషాలేంటో చూద్దాం.
దర్యాప్తు సంస్థల మధ్య వేగంగా సమాచార మార్పిడి. విదేశీ దర్యాప్తు సంస్థలతో సమన్వయానికి వీలు కలుగుతుంది. విదేశాల్లో ఉన్న నిందితులు, నేరగాళ్లు వివరాలను ఈ పోర్టల్ వేదికగా ఇంటర్పోలు, వివిధ దేశాల దర్యాప్తు సంస్థలకు పంపొచ్చు. రెడ్ కార్నర్ నోటీసుల అంశంపై సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు ఇచ్చిపుచ్చుకోవచ్చు. డ్రగ్స్, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, ఇతర సరిహద్దు నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కోవడంలో 'భారత్ పోల్' నెట్వర్క్ 195 దేశాలతో సహకారాన్ని అందించగలదు.
కేంద్ర, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల దర్యాప్తు సంస్థలు పరస్పర సమన్వయం చేసుకోవచ్చు. లెటర్లు, ఈమెయిల్స్, ఫ్యాక్సులు వంటి పాత తరహా కమ్యూనికేషన్ వ్యవస్థల స్థానంలో భారత్ పోల్ సమాచార మార్పిడికి వేదికవుతుంది. డిజిటల్ మాధ్యమంలో వేగంగా సమాచార బదిలీ జరుగుతుంది. • సీబీఐ, ఇంటర్పోల్ మధ్య కమ్యూనికేషన్ మునుపటి కంటే మెరుగవుతుంది.
అంతర్జాతీయ మద్దతు అవసరమైన సున్నితమైన కేసుల్లో పోలీసు శాఖకు అవసరమైన అన్ని రకాల టెక్నికల్ టూల్స్ ను, వాటిపై గైడెన్స్ ను ఈ పోర్టల్ అందిస్తుంది. ఈ పోర్టల్ కి ఇంటర్ పోల్ నుండి 19 రకాల డేటాబేస్లకు యాక్సెస్ ఉంటుంది. ఇది నేరాలను విశ్లేషించడానికి, వాటిని నిరోధించడానికి, నేరస్థులను పట్టుకోవడానికి సహాయపడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com