Bihar MP Pappu : వాళ్లంతా కుంభమేళాకు వెళ్లి చచ్చిపోవాలి: ఎంపీ పప్పూ

బిహార్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారందరికీ మోక్షం దక్కిందని ఓ బాబా అన్నారని.. దాన్ని బట్టి రాజకీయ నాయకులు, ధనవంతులు, బాబాలు త్రివేణీ సంగమంలో మునిగి చనిపోవాలని సూచించారు. వారికి మోక్షం వస్తుందని ఎద్దేవా చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వందలాది మందిని దహన సంస్కారాలు లేకుండా తీసిపారేశారని పప్పూ ఆవేదన వ్యక్తం చేశారు.
బీహార్కు చెందిన లోక్ సభ ఎంపీ పప్పూ యాదవ్ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా పప్పూ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 29న కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 300 నుంచి 600 మృతదేహాలను అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా తొలగించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. చనిపోయిన వారి దహన సంస్కారాలు హిందూ ధర్మం ప్రకారం జరగలేదని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com