Amit Shah : నక్సలిజానికి ఇది ఎదురుదెబ్బ.. అమిత్ షా క్లారిటీ

Amit Shah : నక్సలిజానికి ఇది ఎదురుదెబ్బ.. అమిత్ షా క్లారిటీ
X

ఛత్తీస్‌ గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలిజానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. ఇది నక్సల్స్‌ లేని భారత్ దిశగా కీలక అడుగని వ్యాఖ్యానించారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందంటూ ఎక్స్‌ వేదికలో ట్వీట్‌ చేశారు. ఒడిశా- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని గరియాబంద్ జిల్లా కులారి ఘాట్ వద్ద భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. నక్సల్స్ రహిత భారతదేశం కోసం మన సంకల్పం నిలబడిందని ట్వీట్‌లో అమిత్ షా పేర్కొన్నారు.

Tags

Next Story