Maoist Leader Nambala Keshav Rao : నంబాల కేశవరావు బ్యాక్ గ్రౌండ్ ఇదే

Maoist Leader Nambala Keshav Rao : నంబాల కేశవరావు బ్యాక్ గ్రౌండ్ ఇదే
X

చత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లా ఎన్ కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు. బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాధ్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. నంబాళ్ల కేశవరావుపై కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతలను నంబాల కేశవరావు నిర్వహించారు. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట. తూర్పు గోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్వర్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కేశవరావు పనిచేశారు. అతడితలపై రూ.1.5 కోట్ల రివార్డు ప్రకటించారు.

వరంగల్ ఆర్ ఈసీలో నంబాల కేశవరావు ఇంజినీరింగ్ చదివారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో మావోయిస్టు పార్టీకి మూలస్తంభంగా ఉన్నారు. 1987లో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ, మాజీ సైనికుల వద్ద శిక్షణ తీసుకున్నారు. 2018 నవంబర్లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల బాధ్యతలు చేపట్టారు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు సంబాల సూత్రధారిగా ఉన్నారు.

Tags

Next Story