Uddhav Thackeray: ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధమే.. అవసరమైతే..: ఉద్ధవ్ థాక్రే

Uddhav Thackeray: ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి తాను సిద్ధమేనన్నారు ఉద్ధవ్ థాక్రే. అవసరం అనుకుంటే శివసేన అధ్యక్ష పదవి కూడా వదులుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా తనకు సమ్మతమేనన్నారు. తానే ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకోవడం లేదన్నారు. ఎవరితోనైనా ముఖాముఖి మాట్లాడుతానని.. రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. తనకు ఆ పదవిపై ఎలాంటి వ్యామోహం లేదన్నారు.
అందరూ కలిసి అడిగితేనే తాను ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో తాను ఎన్నో ఏళ్లు పోరాడానని చెప్పారు. ప్రజల మద్ధతుతోనే ముఖ్యమంత్రిని అయ్యానని అన్నారు. ఎప్పుడో బాత్రూమ్‌కు వెళ్లినప్పుడు ఫోన్ ఎత్తనంత మాత్రాన.. ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటున్నానని అంటున్నారన్నారు. శివసేన ఎప్పుడూ మూల సూత్రాలను విడిచి ప్రవర్తించలేదన్నారు. శివసేన అంటేనే హిందుత్వ - హిందుత్వ అంటే శివసేన అన్నారు. మహా వికాస్ ఆఘాడీ సర్కార్ హయాంలో మహారాష్ట్ర ముందుకెళ్లిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com