Ratan Tata : రతన్ టాటా అందుకే పెళ్లి చేసుకోలేదట!

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణ వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణం పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా.. తన అత్యున్నత మేథో సంపదతో టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. అయితే రతన్ టాటా ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. అసలు ఆయన పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన ఎవరినైనా లవ్ చేశారా.. పెళ్లి విషయంలో ఎందుకు ఆయన ఆసక్తి చూపలేదు.. ఇలాంటి విషయాలు ఓసారి తెలుసుకుందాం.
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు వివాహం కాలేదు. అవును మీరు వింటున్నది నిజమే.. పెళ్లి కాలేదు కాదు ఆయన చేసుకోలేదు. ఇది చాలా మందికి తెలియని విషయం. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు కూడా. ఆయన నాలుగు సార్లు లవ్ ఫెయిల్ అయినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రతన్ టాటా తన ప్రేమ జీవితం గురించి మాట్లాడుతూ.. తన జీవితంలో ఒక్కసారి కాదు నాలుగు సార్లు ప్రేమ తలుపు తట్టిందని, అయితే క్లిష్ట పరిస్థితుల కారణంగా తమ బంధం పెళ్లి వరకు రాలేదని చెప్పాడు. దీని తర్వాత ఆయన మళ్లీ పెళ్లి గురించి ఆలోచించలేదట. తన జీవితం మొత్తం దేశంలో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు.
రతన్ టాటా 1937 డిసెంబర్ 28న సూరత్‌లో జన్మించారు. వ్యక్తిత్వంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. టాటా గ్రూప్ ఆఫ్ బిజినెస్‌లను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. అందుకే టాటా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. కానీ వ్యాపారంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరుగా పేరు తెచ్చుకున్న రతన్ టాటా.. ప్రేమలో మాత్రం విఫలమయ్యారు. తన ప్రేమలు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. తాము ప్రేమలో ఉన్నా, వివాహం చేసుకోకూడదనే నిర్ణయం నాకు సరైనదిగా అనిపించింది. ఆమె నా జీవితంలో ఉంటే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేదని చెప్పాడు. ‘మీరెప్పుడైనా నాకు క్రష్ ఉందా అని ప్రశ్నిస్తే.. నేను పెళ్లి గురించి నాలుగు సార్లు సీరియస్‌గా ఆలోచించానని చెబుతాను. అయితే ప్రతిసారీ ఏదో ఒక రకమైన భయంతో నేను వెనక్కి తగ్గానని కూడా చెబుతాను. తన ప్రేమ రోజుల గురించి టాటా మాట్లాడుతూ.. ‘నేను అమెరికాలో పని చేస్తున్నప్పుడు, నా ప్రేమ గురించి చాలా తీవ్రంగా ఉండేవాడిని. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత మేము వివాహం చేసుకోలేకపోయాం’ అని గతంలో కొన్ని సందర్భాల్లో రతన్ చెబుతూ ఒకింత భావోద్వెగానికి లోనయ్యారు. పెళ్లి కాదనుకుని.. తన యావత్ జీవితాన్ని టాటా గ్రూప్ కోసం అలాగే సమాజ సేవ కోసం అకింతం చేసిన గొప్ప మహనీయుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com