పెళ్లై మూడు నెలలు.. జూకి వెళ్లి గుండెపోటుతో భర్త.. షాక్ తో ఏడో అంతస్తు నుంచి దూకి భార్య..

పెళ్లై మూడు నెలలు.. జూకి వెళ్లి గుండెపోటుతో భర్త.. షాక్ తో ఏడో అంతస్తు నుంచి దూకి భార్య..
ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావట్లేదు.. అప్పటి వరకు బాగానే ఉంటున్నారు..

ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావట్లేదు.. అప్పటి వరకు బాగానే ఉంటున్నారు.. అంతలోనే మృత్యువు వారిని కబళించేస్తుంది. ఉన్నట్టుండి విగత జీవులుగా మారుతున్నారు.. ఎంతో జీవితం, ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.. విధికి కన్నుకుట్టిందేమో ఆ చూడుచ్చటైన జంటను చూసి.. గుండెపోటు రూపంలో అతడిని కబళించింది. ఏడాది కాకుండానే దూరమైన భర్త ఎడబాటుని భరించలేక భార్య బలవంతంగా తాను కూడా ప్రాణం తీసుకుంది. ఈ హటాత్ పరిణామం కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది.

కొత్తగా పెళ్లయిన జంట ఢిల్లీ జంతుప్రదర్శనశాలను సందర్శించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఆ యువకుడికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.. వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో షాక్‌కు గురైన ఆయన భార్య ఘజియాబాద్‌లోని ఆమె ఇంటి ఏడో అంతస్థు నుంచి దూకి మృతి చెందింది.

నూతన వధూవరులు - ప్రాపర్టీ డీలర్ అభిషేక్ అహ్లువాలియా (25) అతని భార్య అంజలి (22). సోమవారం జూను సందర్శించినప్పుడు ఈ సంఘటన జరిగింది. అహ్లువాలియాకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. భయాందోళనకు గురైన అంజలి తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాత అహ్లువాలియాను ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించిన అనంతరం ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం అహ్లువాలియా మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అతని మృతదేహాన్ని చూసి అంజలి పక్కనే కూర్చున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆ తర్వాత ఆమె బాల్కనీలోకి వెళ్లి దూకింది. ఈశాన్య ఢిల్లీలోని కరవాల్ నగర్‌లో నివాసం ఉంటున్న అంజలిని వెంటనే మాక్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెను ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. గత ఏడాది నవంబర్‌లోనే వీరి వివాహం జరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Tags

Next Story