TMC MP: సెబీ చీఫ్‌ఫై లోక్‌పాల్‌లో టీఎంసీ ఎంపీ ఫిర్యాదు

TMC MP: సెబీ చీఫ్‌ఫై లోక్‌పాల్‌లో టీఎంసీ ఎంపీ ఫిర్యాదు
X

సెబీ(సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛ్సేంజ్‌ బోర్డు) చీఫ్ మాధబి పురి బుచ్ పై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్ పాల్ లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఫిర్యాదు పత్రాన్ని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మాధబి పురి, ఆమె భర్త క్విడ్ ప్రోకో ద్వారా అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించారు. “మాధబి పురి, ఆమె భర్త ధవల్ బుచ్ పై ఎలక్ట్రానిక్ రూపంలో, ప్రత్యక్షంగానూ లోక్ పాల్ లో ఫిర్యాదు చేశారు. లోక్ పాల్ ఫిర్యాదుని పరిశీలించి 30 రోజుల్లోగా ప్రాథమిక దర్యాప్తు కోసం సీబీఐ లేదా ఈడీ విచారణ చేసేలా చూడాలి. ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి. ప్రతి లింక్ పైనా ఆరాలు తీయాలి” అని మొయిత్రా సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేసింది. ఇక, సెబీ చీఫ్‌పై వస్తున్న ఆరోపణల వల్ల స్టాక్ మార్కెట్ లో ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా పెట్టుబడిదారులుగా ఉన్న 10 కోట్ల మంది సామాన్యులపై ఇది ప్రభావం చూపుతోందన్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశంగా దీన్ని పరిగణించి వెంటనే విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.కాగా 2017 నుంచి 2021 వరకు సెబీ సభ్యురాలిగా ఉన్న మాధవీ బుచ్‌.. 2022 మార్చిలో సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. సెబీలో చేరినప్పటికీ ఆమె ఐసీఐసీఐ బ్యాంకు అధికారి హోదాలో జీతభత్యాలు అందుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సెబీ చీఫ్‌గా ఉంటూ ఐసీఐసీఐ నుంచి వేతనం ఎందుకు తీసుకుంటున్నారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Tags

Next Story