PM Modi : ఇవాళ కార్గిల్ దివస్.. సైనికుల శౌర్యాన్ని గుర్తుచేస్తుందన్న ప్రధాని

ఇవాళ కార్గిల్ దివస్. 1999లో కార్గిల్ లో పాకిస్థాన్ పై యుద్ధంలో గెలిచిన సందర్భంగా ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ దివస్ జరుపుకుంటారు. 26 ఏళ్ల క్రితం కార్గిల్ యుద్ధం జరిగింది. భారత సైనికుల విరోచిత పోరాటంతో పాక్ తోకముడిచింది. ఈ యుద్ధంలో తొలుత పాక్ పై చేయి సాధించినట్లు కనిపించిన.. ఆ తర్వాత భారత సైనికుల పరాక్రమానికి ఎదరునిలవలేక పోయింది. కాగా ఈ యుద్ధంలో ఎంతో మంది భారత సైనికులు అమరులయ్యారు. వారికి గుర్తుగా ప్రతి ఏటా కార్గిల్ దివస్‌ను జరుపుకుంటాం.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ట్వీట్ చేశారు. దేశవాసులకు కార్గిల్ విజయ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. భరతమాత వీర సైనికుల అసమాన ధైర్యం, శౌర్యాన్ని కార్గిల్ దివస్ గుర్తు చేస్తుందని మోదీ అన్నారు. ఎంతో మంది సైనికులు దేశరక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించారని.. వారి త్యాగం ప్రతి తరాన్ని ప్రేరేపిస్తుందని తెలిపారు. జై హింద్ అంటూ మోదీ ట్వీట్ లో రాసుకొచ్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com