Tomato Prices: సామాన్యులపై టమాటా భారం

Tomato Prices: సామాన్యులపై టమాటా భారం
X

టమోటా ధర పరుగులు పెడుతుండటంతో సామాన్యులకు భారంగా మారింది. ప్రతి వంటకాల్లో ఎక్కువగా వినియోగించే టమోటా ధర పెరగడంతో ప్రజలకు భారంగా మారింది. టమోటాలను కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. పెరిగిన టమోట ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.సాధారణంగా కిలో 30 నుంచి 40 ఉండే టమోటా ధర ఇప్పుడు ఏకంగా 120 నుంచి 140 రూపాయలకు ఎగబాకింది. ధరలు పెరగడంతో సామాన్యుడికి పెను భారంగా మారింది. ప్రతి వంటకాల్లో వినియోగించే టమోటాను ఇప్పుడు కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆహారంలో ఉపయోగపడే ఈ రోజువారీ టమోటా ఇప్పుడు ద్రవ్యోల్బణంతో కన్నీళ్లు పెట్టిస్తోంది.చాలా నగరాల్లో 140కి చేరుకుంది. వర్షం కారణంగా టమోటాలు సరఫరా కాకపోవడంతో ప్రజలు అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది.

అయితే టమాటా సెంచరీ సాధించే స్థాయికి చేరుకున్నా..దళారులు లాభాన్ని లాగేసుకోవడం వల్ల రైతులకు ప్రయోజనం కలగడం లేదు. రిటైల్ మార్కెట్‌లో మీడియం క్వాలిటీ టొమాటో కిలోకు వంద.. సఫాల్ స్టోర్‌లో కిలో 78 వరకు అమ్ముడవుతోంది. ఈ రెండు రకాలు మధ్యస్థ నాణ్యతతో ఉంటాయి. టాప్ క్వాలిటీ టమోటా ధర మాత్రం ఇంకా అధికంగానే ఉంది.

ఎండ, తీవ్ర వడగాల్పులతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. రుతుపవనాల రాకతో పరిస్థితులు మారినా పలు ప్రాంతాల్లో పంట దెబ్బ తిన్నది. టమాటా సాగు ఎక్కువగా ఉండే కర్ణాటకలోని బెంగళూరు రూరల్‌, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర్‌, కోలార్‌, రామనగర జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండటంతో టమాట మోత మోగిస్తుంది. అయితే పంట నష్టంతోపాటు సరఫరాలో అంతరాయంతో ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. చాలాచోట్ల టమాటా ధర ఇప్పటికే వందకు చేరుకోగా.. రానున్న రోజుల్లో మరింత పెరగనుందని కానుందని అంచనా వేస్తున్నారు.

మరో వైపు సబ్సిడి రేట్ల ప్రజలకు కూరగాయలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ఏపీ సర్కార్‌.. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేయడంలో మాత్రం విఫలమైందని ప్రజలు అంటున్నారు. అనేక షరతులు పెట్టి ఒక మనిషికి ఒక కిలో మాత్రమే అందిస్తున్నారని మండిపడుతున్నారు.

Tags

Next Story