UP : సర్జరీ చేసి టవల్ కడుపులో వదిలేశారు!

యూపీలోని అలీగఢ్‌లో శివ్ మహిమ ఆస్పత్రి వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఓ గర్భిణికి డెలివరీ చేసిన తర్వాత ఆమె కడుపులో టవల్ వదిలేసి కుట్లు వేసేశారు. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన తన భార్య ఆ తర్వాత కూడా కడుపునొప్పితో బాధపడిందని బాధితురాలి భర్త తెలిపారు. వేరే ఆస్పత్రిలో చేర్పించగా టవల్ ఉన్నట్లు గుర్తించి బయటికి తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ దర్యాప్తునకు ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com