Rajasthan : రాజస్థాన్ దౌసాలో విషాదం.. సిబ్బంది పడిన శ్రమ వృథా

రాజస్థాన్ దౌసాలో విషాదం నెలకొంది. ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన ఐదేళ్ల చిన్నారి మృతిచెందాడు. 55 గంటల పాటు పొక్లెయిన్లతో బాలుడిని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది పడిన శ్రమ వృథా అయింది. చిన్నారిని వెలికితీసి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. బాలుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. గాయాలు, ఆక్సిజన్ కొరత వల్ల బాలుడు మృతి చెందాడని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అల్యూమినియంతో తయారు చేసిన హుక్ ద్వారా బాలుడిని బయటకు తీయడానికి విఫలయత్నం చేశారు. అది ఫలించకపోవడంతో బోరుబావికి కొంత దూరంలో 4 అడుగుల వెడల్పుతో గుంత తీశారు. 150 అగుడుల మేర తవ్వకం పూర్తయిన తర్వాత అందులోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది.. సొరంగం తవ్వి బాలుడిని కాపాడారు. అప్పటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో గ్రీన్ చానల్ ఏర్పాటుచేసి అంబులెన్సులో దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మరణించనట్లు వైద్యులు నిర్ధారించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com