Maharashtra : మహారాష్ట్ర ఎన్నికల్లో విషాదం..ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి

Maharashtra : మహారాష్ట్ర ఎన్నికల్లో విషాదం..ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి
X

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బీడ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే గుండెపోటుతో మరణించారు. బీడ్ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచిన బాలాసాహెబ్ ఛత్రపతి షాహూ విద్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ఎన్నికల తీరును పర్యవేక్షిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను సన్నిహితులు ఛత్రపతి శంభాజీ నగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో బీడ్ సెగ్మెంట్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. బీడ్‌లో షిండే ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు.

Tags

Next Story