Family Suicide : విషాదం.. కుటుంబమంతా ఆత్మహత్య

Family Suicide : విషాదం.. కుటుంబమంతా ఆత్మహత్య
X

కర్ణాటక మైసూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. మృతులను చేతన్(45), అతని భార్య రూపాలీ(43), కొడుకు కుశాల్(15), తల్లి ప్రియమ్‌వదా(62)గా పోలీసులు గుర్తించారు. చేతన్ తొలుత కుటుంబసభ్యులకు విషమిచ్చి తాను ఉరివేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ఆత్మహత్యకు ముందు చేతన్ యూఎస్‌లో ఉన్న సోదరుడికి కాల్ చేసి, తాను చాలా ఆర్దిక ఇబ్బందులతో సతమతమవుతున్నానని, ఇంకా ఆ భాధను తట్టుకోలేకపోతున్నానని, అప్పుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నామని చెప్పి కాల్ కట్ చేశాడు. అనంతరం అతని సోదరుడికి అనుమానం వచ్చి, వెంటనే బంధువులకు సమాచారం అందించాడు.

కుటుంబమంతా ఇంత కఠినమైన చర్య తీసుకోవడానికి కారణం మానసిక క్షోభే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చేతన్ భారీ అప్పులతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. చేతన్ ఫోన్ రికార్డులు, అతని ఆర్థిక లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ కుటుంబం గత పది సంవత్సరాలుగా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుందని, సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లుగా పక్కంటివాళ్లు చెబుతున్నారు.

Tags

Next Story