Wayanad : కేరళలోని వయనాడ్‌లో ఘోరప్రమాదం

Wayanad : కేరళలోని వయనాడ్‌లో ఘోరప్రమాదం
X

కేరళలోని వయనాడ్‌లో ఘోరప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 43 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. కొండచరియల్లో 400 మంది కుటుంబాలు చిక్కుకున్నారు. చురల్‌మలా గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలాయి.

ఘటనాస్థలికి వెళ్లే రోడ్డు మార్గాలు ధ్వంసం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. వయనాడ్‌ లోయ ప్రాంతాలకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్‌, పాలక్కాడ్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్‌తో మాట్లాడి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు మోదీ ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సానుభూతి తెలియజేశారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించినట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Tags

Next Story