Delhi : యమునా నదిలో శవమై కనిపించిన త్రిపుర బాలిక

Delhi : యమునా నదిలో శవమై కనిపించిన త్రిపుర బాలిక
X

ఢిల్లీలో గత ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన త్రిపురకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని స్నేహా దేబ్‌నాథ్ మృతదేహం యమునా నదిలో లభ్యమైంది. ఢిల్లీ యూనివర్సిటీలో బీఎస్సీ సెకండియర్ చదువుతున్న స్నేహ, జూలై 7వ తేదీ నుండి కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్నేహా దేబ్‌నాథ్ జూలై 7న తన స్నేహితురాలిని రైల్వే స్టేషన్‌లో దించి వస్తానని చెప్పి వెళ్లింది. ఆ రోజు ఉదయం 5 గంటల సమయంలో క్యాబ్ బుక్ చేసుకుంది. ఉదయం 9 గంటల తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. క్యాబ్ డ్రైవర్ ఆమెను వజీరాబాద్‌లోని సిగ్నేచర్ బ్రిడ్జ్ దగ్గర దింపినట్లు తెలిపాడు. ఆరు రోజుల తర్వాత తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీ సమీపంలో యమునా నదిలో స్నేహా మృతదేహం లభ్యమైంది. ఆమె హాస్టల్ గదిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తాను "విఫలమయ్యానని మరియు భారంలా భావిస్తున్నానని, ఇలా జీవించడం భరించలేకపోతున్నానని" రాసింది. సిగ్నేచర్ బ్రిడ్జ్ నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కూడా ఆ నోట్‌లో ఉంది. "ఇందులో ఎలాంటి కుట్ర లేదు. ఇది నా నిర్ణయం" అని ఆమె రాసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story