Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

Rajasthan: జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై  ఘోర రోడ్డు ప్రమాదం
బస్సు, ట్రక్కు ఢీ… 11 మంది మృతి,మరో 15 మందికి తీవ్ర గాయాలు

రాజస్థాన్‌లో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై ఆగివున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. గుజరాత్ నుంచి మథురకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హైవేపై బ్రేక్ డౌన్ అయి నిలిచిపోయింది. ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రక్ ఢీకొట్టడంతో బస్సులోని 11 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.


ప్రమాదం ఎటునుంచి పొంచి వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియడు. ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో మరణం వెంటాడుతూ వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో 11 మంది చనిపోయారు. రాజస్తాన్ లోని భరత్ పూర్ లో ఈ ఘటన జరిగింది.జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును ఓ ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 11 మంది దుర్మణం పాలయ్యారు, 12 మంది గాయపడ్డారు. వివరాల ప్రకారం బస్సు రాజస్థాన్‌లోని పుష్కర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళ్తుంది. ఇంతలో లఖన్‌పూర్ ప్రాంతంలోని అంట్రా ఫ్లైఓవర్ వద్ద బస్సులో ఇంధనం అయిపోవడంతో బస్సు అక్కడ వేచి ఉంది. బస్సు డ్రైవర్ తో పాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనుక నిలబడి ఉన్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఓ ట్రక్కు బస్సును వెనక వైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్సు బ్రిడ్జి మీద నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో 11 మంది అప్పటికప్పుడే మరణించారు. చనిపోయిన వారిలో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. వారు అక్కడికక్కడే మరణించారు. అంతే కాకుండా 12 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. దీంతో అక్కడ అంతా విషాద వాతావరణం నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story