Justin Trudeau: విమానంలో సాంకేతిక సమస్య

Justin Trudeau: విమానంలో సాంకేతిక సమస్య
రాత్రంతా ఢిల్లీలోనే బస చేసిన కెనడా ప్రధాని ట్రూడో

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దిల్లీ విమానాశ్రయంలోనే దానికి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. జీ20 సదస్సు ముగిసిన నేపథ్యంలో ట్రూడో ఆదివారం రాత్రి 8 గంటలకు ది ల్లీ నుంచి కెనడా బయలుదేరాల్సి ఉంది. అయితే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆయన రాత్రి ఢిల్లీ లోనే ఉండిపోయారు.

జీ20 శిఖరాగ్ర సమావేశాల అనంతరం స్వదేశానికి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చివరి నిమిషంలో అనుకోని అవాంతరం ఎదురైంది. ఆయన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణం వాయిదా పడింది. ప్రస్తుతం భారత్‌లోనే ఉన్న కెనడా ప్రధాని, ఆయన బృందం మళీ ఎప్పుడు బయలుదేరుతారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ‘‘ఈ సమస్యలు ఒక్క రాత్రిలో పరిష్కారం కావు. ప్రత్యామ్నాయం సిద్ధం చేసే వరకూ మా బృందం భారత్‌లోనే ఉంటుంది’’ అని కెనడా ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


అంతకుమునుపు జస్టిన్ ట్రూడోతో మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ భూభాగంలో సిక్కు వేర్పాటువాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కొందరు అతివాదులు కెనడా వేదికగా భారత వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతుండటంపై ప్రధాని మోదీ కెనడా ప్రధాని వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వేర్పాటువాదులు, వ్యవస్థీకృత నేరస్తులు, డ్రగ్స్, మానవుల అక్రమరవాణాకు పాల్పడేవారు కుమ్మక్కవడం కెనడాకు కూడా ఆందోళన కారకమే. ఈ ప్రమాదాలను ఎదుర్కొనేందుకు రెండు దేశాలు కలిసికట్టుగా పనిచేయడం ఆవస్యకం’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే రెండు రోజుల G20 లీడర్స్ సమ్మిట్ ముగింపులో ట్రూడో కెనడాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని, ఆ దిశగా ఇరుదేశాలు పని చేస్తాయని మోడీ ఉద్ఘాటించారు.

సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో ట్రూడో మాట్లాడుతూ.. "హింసను నిరోధించడానికి, ద్వేషానికి వ్యతిరేకంగా వెనక్కి నెట్టడానికి తాము ఎల్లప్పుడూ ముందు ఉంటామనీ, కెనడా ఎప్పుడూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ, శాంతియుత నిరసన స్వేచ్ఛను కాపాడుతుందని అన్నారు.

వాతావరణ మార్పు, పౌరులకు వృద్ధి, శ్రేయస్సును సృష్టించే సమస్యలపై ట్రూడో భారతదేశాన్ని కెనడాకు ముఖ్యమైన భాగస్వామని కూడా పేర్కొన్నారు. చేయవలసిన పని చాలా ఉంటుందనీ, తాము దానిని కొనసాగిస్తామని కెనడా ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం ఉన్న సహకారాన్ని విస్తరించడం గురించి ఇరుపక్షాలు పరిశీలిస్తూనే ఉంటాయి. వివిధ రంగాల్లో భారత్-కెనడా సంబంధాలపై తాను, ట్రూడో చర్చించుకున్నట్లు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో మోదీ పోస్ట్ చేశారు.


Tags

Read MoreRead Less
Next Story