Trump : న్యూయార్క్ టైమ్స్‌పై రూ.1.32 లక్షల కోట్లకు ట్రంప్ దావా

న్యూయార్క్ టైమ్స్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూ.1.32 లక్షల కోట్ల (15 బిలియన్ డాలర్లు) పరువు నష్టం దావా వేశారు. ఈ దావాను ఫ్లోరిడాలోని ఒక కోర్టులో దాఖలు చేశారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక తనపై తప్పుడు కథనాలు ప్రచురించి, తన ప్రతిష్టకు భంగం కలిగించిందని ట్రంప్ ఆరోపించారు. తన కుటుంబం, వ్యాపారాలు 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' (MAGA) ఉద్యమంపై న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనాలు ప్రచురించిందని ట్రంప్ ఆరోపించారు. ఈ పత్రిక డెమొక్రాట్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, తనపై వ్యతిరేక ప్రచారం చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనాల వల్ల తనకు భారీ ఆర్థిక, వ్యక్తిగత నష్టం జరిగిందని, అందుకే ఇంత పెద్ద మొత్తంలో దావా వేస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ గతంలో కూడా పలు మీడియా సంస్థలపై పరువు నష్టం దావాలు వేశారు. అయితే ఈసారి వేసిన దావా మొత్తం భారీగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ దావాపై న్యూయార్క్ టైమ్స్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com