Modi Birthday Wishes : మోదీకి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. థ్యాంక్స్ చెప్పిన ప్రధాని

Modi Birthday Wishes : మోదీకి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. థ్యాంక్స్ చెప్పిన ప్రధాని
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సమగ్ర భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారం కోసం ట్రంప్ చూపుతున్న చొరవకు తాను మద్దతు ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. జూన్ 17 తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన తొలి ఫోన్ కాల్ ఇదే కావడం గమనార్హం.

గతంలో ట్రంప్ హయాంలో భారత్‌పై 50శాతం సుంకాలు విధించడం, అలాగే ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపానని పదే పదే చెప్పడం వంటి చర్యల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గకపోవడంతో ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చింది. ఇటీవల ఆయన మోదీ తన మంచి మిత్రుడని అన్నారు. వాణిజ్య చర్చల కోసం మోదీతో మాట్లాడాలని చూస్తున్నట్లు తన సోషల్ మీడియాలో కూడా తెలిపారు. ఈ తాజా ఫోన్ కాల్ రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడానికి, భవిష్యత్తులో మరింత బలోపేతం చేయడానికి ఒక సానుకూల సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags

Next Story