NDA : ట్విస్ట్.. ఆధిర్‌కు ఎన్డీయే ఆహ్వానం

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఎన్టీయే కూటమిలో చేరాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఆహ్వానించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) చీఫ్ అథవాలే మాట్లాడుతూ అధిర్ రంజన్ పశ్చిమ బెంగాల్ నుంచి ఓడిపోయినందుకు కాంగ్రెస్ విస్మరించిందని, అవమానించబడ్డాడని అన్నారు. కాంగ్రెస్ ఇలాంటి వైఖరి వల్లే చాలా మంది నేతలు కాంగ్రెస్ వదిలి బీజేపీలో చేరారని అన్నారు.
కాంగ్రెస్ అవమానిస్తే, ఆ పార్టీని వీడాలని అధిర్ రంజనిని అభ్యర్థిస్తున్నానని అథవాలే అన్నారు. ఎన్డీయేలో లేదా తన పార్టీ ఆర్బీఐలో చేరాలని ఆహ్వానించారు. పశ్చిమ బెంగాలీ పీసీసీ చీఫ్ గా ఉన్న తనను ఎలా తొలగించారని అధిర్ రంజన్ మంగళవారం అసంతృప్తిని వ్యక్తం చేశారు. "మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడైన రోజు, పార్టీ రాజ్యాంగం ప్రకారం దేశంలోని పార్టీలోని అన్ని పదవులు తాత్కాలికంగా మారాయి. నా పదవి కూడా తాత్కాలికమే." అని అధిర్ అన్నారు.
ఎన్నికల సమయంలో ఖర్గే అవసరమైతే తనను బయట ఉంచుతామని చెప్పడం నన్ను కలవరపెట్టిందని ఆధిర్ చెప్పారు. తాత్కాలిక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, అది నా బాధ్యతని, వీలైతే మీరు నా స్థానంలో మరొకరిని నియమించుకోవచ్చని ఖర్గేకి తాను చెప్పినట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com