Jammu And Kashmir: ముగ్గురు ఆర్మీ అధికారుల వీరమరణం

Jammu And Kashmir:   ముగ్గురు ఆర్మీ అధికారుల వీరమరణం
అనంత్ నాగ్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, డీఎస్పీ మృతి

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు అధికారులు అమరులు అయ్యారు. ఈ ఎదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్‌చక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ హుమాయున్ భట్‌లు వీరమరణం పొందారు. నంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అనంత్‌నాగ్‌లోని కోకెర్‌నాగ్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో భారీ కాల్పుల మధ్యే పోలీస్ అధికారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్ అధికారులు అందించిన సమాచారం మేర కేంద్రభద్రతా దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఒక ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదులు లష్కరే ప్రాక్సీ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందినవారని కూడా పోలీసువర్గాలు తెలిపాయి. ఘటనలో కల్నల్ అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు అధికారులపై కూడా తీవ్రంగా తుపాకీ కాల్పులు జరిగాయి. వారిని హెలికాప్టర్‌లో శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉగ్రవాదులు లష్కరే ప్రాక్సీ అయిన "ది రెసిస్టెన్స్ ఫ్రంట్"కు చెందినవారని కూడా వర్గాలు తెలిపాయి.


మన్ ప్రీత్ సింగ్ 19 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్. రాష్ట్రీయ రైఫిల్స్ అనేది జమ్మూ కశ్మీర్‌లో పని చేస్తోన్న తిరుగుబాటు నిరోధక దళం. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలోని నార్లా ప్రాంతంలో ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అక్కడ భద్రతా దళాలు పెద్ద మొత్తంలో పాకిస్తాన్ గుర్తులతో ఉన్న కొంత యుద్ధ సామగ్రి, వివిధ వస్తువులు, మందులను స్వాధీనం చేసుకున్నారు.

సెప్టెంబరు 4వతేదీన జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు అధికారి కూడా గాయపడ్డారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి లష్కరే తోయిబా గ్రూపుకు చెందిన ఉగ్రవాదులను ట్రాక్ చేస్తున్ భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story