Union Budget 2026-27: బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఏ రంగానికి ఎంత?

Union Budget 2026-27:  బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఏ రంగానికి ఎంత?
X
ప్రధాన రంగాల వారీగా నిధుల కేటాయింపులు ఇవే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో వివిధ కీలక రంగాలకు భారీగా నిధులు కేటాయించారు. ఈసారి బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పన, దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు కేటాయింపులను బట్టి స్పష్టమవుతోంది. మరి ఈ బడ్జెట్ లో ఏ రంగానికి ఎంత కేటాయించారో వివరంగా చూద్దాం..

ప్రధాన రంగాల వారీగా నిధుల కేటాయింపులు (రూ. కోట్లలో):

* రవాణా (Transport): మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం అత్యధికంగా రూ.5,98,520 కోట్లు.

* రక్షణ రంగం (Defence): దేశ రక్షణ కోసం రూ.5,94,585 కోట్లు.

* గ్రామీణాభివృద్ధి (Rural Development): పల్లెల ప్రగతి కోసం రూ.2,73,108 కోట్లు.

* హోం వ్యవహారాలు (Home Affairs): అంతర్గత భద్రత కోసం రూ.2,55,234 కోట్లు.

* వ్యవసాయం (Agriculture & Allied Activities): అన్నదాతల సంక్షేమం, అనుబంధ రంగాల కోసం రూ.1,62,671 కోట్లు.

* విద్య (Education): విద్యా రంగానికి రూ.1,39,289 కోట్లు.

* ఇంధనం (Energy): రూ.1,09,029 కోట్లు.

* ఆరోగ్యం (Health): ప్రజారోగ్యం కోసం రూ.1,04,599 కోట్లు.

* పట్టణాభివృద్ధి (Urban Devlopment): పట్టణాభివృద్ధి కోసం రూ. 85,522 కోట్లు.

* ఐటీ మరియు టెలికాం (IT & Telecom): రూ.74,560 కోట్లు.

* వాణిజ్యం మరియు పరిశ్రమలు (Commerce & Industry): రూ.70,296 కోట్లు.

* సామాజిక సంక్షేమం (Social Welfare): రూ.62,362 కోట్లు.

* శాస్త్రీయ విభాగాలు (Scientific Departments): రూ.55,756 కోట్లు.

* ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (Tax Administration): రూ.45,500 కోట్లు.

* విదేశీ వ్యవహారాల అభివృద్ధి (External Affairs): రూ.22,119 కోట్లు.

* ఆర్థిక శాఖ( Finance): రూ.20,649 కోట్లు.

* ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి: రూ.6,812 కోట్లు.

Tags

Next Story