Union Minister Fire : కేంద్ర మంత్రికి విరిగిన కుర్చీ.. ఎయిర్ ఇండియాపై ఫైర్

Union Minister Fire : కేంద్ర మంత్రికి విరిగిన కుర్చీ.. ఎయిర్ ఇండియాపై ఫైర్
X

ఎయిర్ ఇండియాపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తనకు విమానంలో విరిగిన కుర్చీ కేటాయించారని మండిపడ్డారు. డబ్బు తీసుకుని ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నారని, ఇది వారిని మోసం చేయడమేనని దుయ్యబట్టారు. టాటా టేకోవర్ తర్వాత కూడా సంస్థ తీరు మారలేదన్నారు. దీంతో ఎయిర్ ఇండియా క్షమాపణ కోరింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామంది.

1932వ సంవత్సరంలో టాటా గ్రూప్ టాటా ఎయిర్ సర్వీసెస్ పేరుతో ఎయిన్ ఇండియాను స్థాపించింది.అయితే స్వాతంత్ర్యం వచ్చాకా 1953లో అప్పటి ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రూ ఈ సంస్థను జాతీయం చేశారు. 69 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగగా.. 2022లో ప్రభుత్వం విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గ్రూపునకు అప్పగించింది.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఇక ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags

Next Story