Jammu & Kashmir : జమ్ము కశ్మీర్ లో అకాల వర్షాలు.. ముగ్గురు మృతి

దేశంలో కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. జమ్ము కశ్మీర్‌లో కురిసిన అకాల వర్షాలు, తలెత్తిన వరదు ముగ్గురి ప్రాణాలు తీశాయి. ఈ వానల కారణంగా జమ్మూ కశ్మీర్లో కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 21న జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతంలో వర్షాలతోపాటు గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది.
జమ్మూ కశ్మీర్‌తో పాటు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయా ప్రాంతాల్లో ఏప్రిల్ 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానికంగా వరదలు, అంతరాయాలు ఏర్పడవచ్చని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలతోపాటు గంటకు 30-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఈశాన్య భారతదేశంలో కూడా రాబోయే ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com