UPA: 2024 ఎన్నికల్లో చావో రేవో..సన్నద్దమవుతోన్న కాంగ్రెస్

పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా జాతీయ పార్టీలు తమ తమ పొలిటికల్ అలయెన్సెస్‌ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి.2024 ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతోంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తేవడానికి ప్రయత్నిస్తోంది. అవసరమైతే ఓ మెట్టు దిగుతోంది.ఈనేపధ్యంలో ఇవాళ, రేపు బెంగళూరులో విపక్ష పార్టీల రెండో భేటీని నిర్వహించనుంది. గత నెల 23న బిహార్‌లో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో 15 పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే బెంగళూరులో జరిగే సమావేశంలో పాల్గొననున్న విపక్ష పార్టీల సంఖ్య పెరిగింది.ఈ సమావేశానికి టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా హాజరు కానున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమెకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని సమాచారం.
ఇక బిహార్ సమావేశంలో పాల్గొనని ఆర్‌ఎల్‌డీ,ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ పార్టీలు బెంగళూరు భేటీకి హాజయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం 24 విపక్ష పార్టీలకు పార్లమెంట్‌లో 150 మంది ఎంపీలు ఉన్నారు.విస్తృత చర్చల తర్వాత నేతలంతా ఉమ్మడి ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఈ భేటీలో తమ కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతో పాటు భవిష్యత్‌లో వివిధ రాష్ట్రాల్లో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది.విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీల్లో పాల్గొంటారు.
మరోవైపు విపక్ష నేతలు కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిర్వహించే విందులో అనధికారిక చర్చలు జరిగే అవకాశం ఉంది.యూపీఏ కూటమి నేతలు విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీకి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా.. ఆయా విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీల్లో పాల్గొంటారు.మొత్తమ్మీద బెంగళూరు భేటీ తర్వాత విపక్షాల కూటమికి ఓ రూపం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జాతీయతావాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తమ కూటమి పేరులో జాతీయ అనే పదం వుండేలా చూసుకుంటున్నాయి బీజేపీయేతర విపక్ష పార్టీలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com