UPI Payments : UPI పేమెంట్స్ చేసేవారు ఇది తెలుసుకోండి!

నిన్న ఒక్కసారిగా UPI పేమెంట్స్ పనిచేయకపోవడంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఒక్కోసారి ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా లేకపోయినా UPI పేమెంట్స్ చేయలేం. అలాంటప్పుడు ఇలా చేయండి. తొలుత బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి *99# డయల్ చేస్తే మెనూ వస్తుంది. మనీ సెండింగ్, రిక్వెస్ట్ మనీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆప్షన్లలో కావాల్సింది ఎంచుకోండి. రిసీవర్ మొబైల్ నంబర్, UPI ఐడీ ఎంటర్ చేసి డబ్బు పంపించండి.
బ్యాంక్ ఖాతాదారులు ఇకపై నలుగురు నామినీలను యాడ్ చేసుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఈమేరకు నిన్న బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుకు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబర్‌లోనే దీనికి లోక్‌సభలో గ్రీన్‌సిగ్నల్ లభించింది. అటు ఓ వ్యక్తి బ్యాంకులో ఉంచుకునేందుకు అనుమతించే మొత్తం నగదును ఈ బిల్లు ద్వారా రూ.5లక్షల నుంచి రూ.2 కోట్లకు కేంద్రం పెంచింది.
నిన్న రాత్రి 7.30 గంటలకు దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్స్ పనిచేయలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. గంట తర్వాత సమస్యను పరిష్కరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకటించింది. అయినా కొందరు తమ సమస్య అలాగే ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com