Gautam Adani : గౌతమ్ అదానీపై యూఎస్ లో నమోదైన అభియోగాలు ఇవే

అమెరికాలో మోసం, లంచం ఆరోపణలపై భారత బిలియనీర్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై యూఎస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి అదానీ, అతడి అల్లుడు సాగర్ అదానీపై వారంట్ కూడా జారీ చేసింది. భారీస్థాయి కాంట్రాక్టు పొందేందుకు 265 మిలియన్ డాలర్ల (రూ.2,029 కోట్లు) లంచాలు ఇచ్చేందుకు యత్నించినట్లు అమెరికాలోని బ్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం సంచలనం సృష్టిం చింది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు మొత్తం ఐదు అభియోగాలతో
గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడితో సహా ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్బీఐ తెలిపింది. అలానే బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి నిధులు సమకూర్చేందుకు యత్నించినట్లుగా ఆరోపణలు చేసింది. పెట్టుబడిదారులు, రుణదాతల నుంచి అదానీ కంపెనీ 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లు సేకరించిందని న్యాయవాదులు వాదించారు. దీంతో న్యాయస్థానం అదానీ అరెస్టు వారంట్ జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com