Kashmir : మణిపూర్, కాశ్మీర్ వెళ్లొద్దు.. అమెరికా అడ్వైజరీ జారీ
భారత్ లో పర్యటించే తమ పౌరులకోసం అమెరికా ప్రత్యేక ప్రయాణ హెచ్చరికలు జారీచేసింది. ఉగ్రవాద దాడులు, సాయుధ ఘర్షణలు చెలరేగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. మణిపూర్,
జమ్ము కాశ్మీర్ లో పర్యటనలు వద్దని తెలిపింది.
"టెర్రరిజం కారణంగా భారత్ లో ఎక్కువ జాగ్రత్తలు పాటించండి. కొన్ని ప్రాంతాలు ప్రమాదకరంగా ఉంటున్నాయి" అని దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదం, సంఘర్షణలు, నేరాల ఘటనలను ఉటంకిస్తూ, భారతను లెవల్-2లో అగ్రరాజ్యం పేర్కొంది. జమ్ము-కాశ్మీర్, ఇండియా-పాక్ సరిహద్దు, మణిపూర్, మధ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు సహా దేశంలోని అనేక ప్రదేశాలను సవరించిన ప్రయాణ సలహాలో లెవల్-4గా తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రయాణాలపై పునరాలోచన చేసుకోవాలని తమ పౌరులను కోరింది. అలాగే లైంగిక వేధింపులు, అత్యాచారాల ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీవ్రవాదులు ఎలాంటి హెచ్చరిక లేకుండా దాడులు చేసే ప్రమాదం ఉందని, ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, ప్రభుత్వ సంస్థలను ముష్కరులు లక్ష్యంగా చేసుకోవచ్చని ట్రావెల్ అడ్వయిజరీలో అగ్ర రాజ్యం స్పష్టంచేసింది.
హింస, నేరాల తీవ్రత కారణంగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ కి వెళ్లొద్దని తెలిపింది. ఒకవేళ యూఎస్ ప్రతినిధులు అత్యవసరంగా మణిపూర్ సందర్శించాల్సిన పరిస్థితి తలెత్తితే ముందస్తు అనుమతి పొందాల ని కూడా ఈ ప్రకటన పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బీహార్, చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఒడిశా రాష్ట్రాల్లో సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లడానికి కూడా ముందస్తు అనుమతి పొందాలని తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com