UP : లవ్ జిహాద్ బిల్లుకు యూపీ ఆమోదం.. దోషులకు యావజ్జీవం

ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ సర్కార్ కీలక బిల్లును ఆమోదించింది. 'లవ్ జిహాద్' బిల్లుకు యోగి ఆదిత్యనాథ్ ( Y) ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై దోషులకు యావజ్జీవం శిక్ష పడే అవకాశం ఉంటుంది. బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు 2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళ వారం ఆమోదం తెలిపింది.
సవరించిన బిల్లు ప్రకారం మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మతిమార్పిడికి పాల్పడే వారికి శిక్ష శిక్ష మరింత పెరగనుంది. ఇలాంటి వారికి గరిష్టంగా యావజ్జీవ జైలుశిక్ష పడుతుంది.
సవరించిన నిబంధనల ప్రకారం మతమార్పిడి ఉద్దేశంతో మైనర్లను, ఇతరులను బెదిరించడం, దాడులు చేయ డం, వివాహం చేసుకోవడం, వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయడం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు.
ఈ కేసుల్లో 20 ఏళ్లు జైలు శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడన వారికి పదేళ్ల జైలు, రూ.50,00 జరిమానా ఉండేది. సవరించిన నిబంధనల ప్రకారం ఎవరైనా సరే కన్వర్షన్ కేసుల్లో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయవచ్చు. గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారం కానీ, ఫిర్యాదు కానీ బాధితులు, తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com