Vaccine For 12-18: 12-18 ఏళ్ల వయసు ఉన్నవారికి వ్యాక్సిన్.. నేటి నుండే పంపిణీ..

X
Vaccine For 12-18: దేశవ్యాప్తంగా ఇవాల్టి నుంచి 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపింది. వీరికి బయాలజికల్ ఈ సంస్థ తయారు చేసిన కార్బెవాక్స్ టీకా మాత్రమే ఇవ్వాలని సూచించింది కేంద్రం. మొదటి డోసు, రెండో డోసుల మధ్య కనీసం 28 రోజుల వ్యవధి ఉండాలని తెలిపింది. 2010 తర్వాత జన్మించి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. 12 ఏళ్లు పూర్తి కాని వారికి టీకా వేయోద్దని సూచించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం మార్చి 1 నాటికి దేశంలో 12-13 ఏళ్ల మధ్య వయస్కులు 4 కోట్ల 7 లక్షల మంది ఉన్నట్లు సమాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
