Vaccination: వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా మరో ల్యాండ్‌మార్క్..

Vaccination: వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా మరో ల్యాండ్‌మార్క్..
Vaccination: కరోనా వల్ల భయపడుతున్న ప్రజలకు చిన్న హోప్ ఇచ్చాయి కోవాక్సిన్, కోవీషీల్డ్.

Vaccination: కరోనా వల్ల భయపడుతున్న ప్రజలకు చిన్న హోప్ ఇచ్చాయి కోవాక్సిన్, కోవీషీల్డ్. ముందుగా ఈ వ్యాక్సిన్‌లు ఇండియాలోనే రావడం దేశానికే గర్వకారణంగా నిలిచింది. వ్యాక్సిన్ వల్ల 100 శాతం కరోనా బారిన పడకుండా ఉంటారని వైద్యులు భరోసా ఇవ్వకపోయినా.. ప్రజలు మాత్రం ఈ వ్యాక్సిన్ వల్లే వాళ్ల ప్రాణాలు నిలబడతాయని గట్టిగా నమ్మారు. చాలావరకు అదే జరిగింది కూడా. తాజాగా ఈ వ్యాక్సినేషన్ మరో మైలురాయిని దాటింది.

ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు మాత్రమే వ్యాక్సినేషన్‌ను ప్రవేశపెట్టారు. వారి తర్వాత అన్‌లైన్‌లో వ్యాక్సిన్ కోసం దరఖాస్తు పెట్టుకోవాలని, అలా పెట్టుకున్నవారికి మాత్రమే వ్యాక్సినేషన్ ఉంటుందని అన్నారు. మెల్లగా ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అవసరమని గుర్తించిన ప్రభుత్వం.. మెల్లగా అందరికీ వ్యాక్సిన్‌ను ఫ్రీగా అందుబాటులోకి తెచ్చింది.

ఇదివరకు 21 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ను అందించేవారు. ఇటీవల టీనేజర్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించారు. ఇక త్వరలోనే పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలా దేశంలో వ్యాక్సినేషన్ రేటు పెరుగుతుండడంతో 2021 అక్టోబర్ 21న ఇండియా 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్క్‌ను అందుకుంది. ఇప్పుడు ఆ రికార్డ్ ఇంకాస్త ముందుకు వెళ్లింది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇండియాలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం 153.90 కోట్ల వ్యాక్సిన్‌ను అందించింది. అందులో ఇంకా 18.43 వ్యాక్సిన్ డోసులు ఉపయోగించనవి అందుబాటులో ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు, కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో వ్యాక్సినేషన్ రేటు పెరగడం అనేది చాలామందికి భరోసాను ఇస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story