Vajpayee : వాజ్‌పేయి శత జయంతి

భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరుగాంచిన అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయింది. MPలోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న కృష్ణబిహారీ వాజ్‌పేయి, కృష్ణదేవి దంపతులకు ఆయన జన్మించారు. 1957లో తొలిసారి ఎంపీ అయిన వాజ్‌పేయి 5 దశాబ్దాల పాటు చట్టసభల్లో ఉన్నారు. 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. అణు పరీక్ష, రోడ్లు, కార్గిల్ యుద్ధంలో విజయం, సంస్కరణలు ఇలా దేశానికి ఎంతో సేవ చేశారు.
వాజ్‌పేయి పార్టీలకు అతీతంగా అభిమానం సొంతం చేసుకోవడంతో పాటు వ్యవహారశైలీ అలాగే ఉండేదని విశ్లేషకులు చెబుతారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు విపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయిని ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా పంపారు. ఆయనపై పీవీకి ఉన్న నమ్మకం అలాంటిది. పాక్ సేనలతో పోరాడి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన అప్పటి ప్రధాని ఇందిరాను దుర్గాదేవితో పోల్చడం వాజ్‌పేయి భోళాతనానికి నిదర్శనమని రాజకీయవేత్తలు అంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com