Vance Couple Schedule : ప్రధానితో భేటీ తర్వాత వాన్స్ దంపతుల షెడ్యూల్ ఇదే

ప్రధానితో భేటీ అనంతరం వాన్స్ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ట్రంప్ టారిఫ్ దూకుడు వేళ.. ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా అనుసరిస్తోన్న కఠిన వలసవిధానాలు భారత్ నుంచి వెళ్లిన విద్యార్థులు, పౌరులకు గుబులు రేపుతున్నాయి. ఈ అంశంపైనా వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
విందు అనంతరం రాత్రే వాన్స్ దంపతులు జై పూర్ కు వెళ్తారు. అక్కడ విలాసవంతమైన రాంభాగ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేస్తారు. మంగళవారం ఉదయం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. అందులో అంబర్ కోట కూడా ఉంది. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో వాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ హయాంలో భారత్, అమెరికా సంబంధాల విస్తృతిపై మాట్లాడతారు. ఈ సమావేశానికి దౌత్యవేత్తలు, విదేశీ పాలసీ నిపుణులు, భారత ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరవుతారు. 23వ తేదీ ఉదయం వాన్స్ కుటుంబం ఆగ్రాకు వెళ్లనుంది. అక్కడ తాజ్ మహల్‌ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ వారు జై పూర్ కు వెళ్తారు. 24వ తేదీన జై పూర్ నుంచి బయలుదేరి అమెరికా వెళ్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com