Vice Presidential Election : ఉప రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా నేపథ్యంలో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం (ECI) చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు ఇక్కడ చూద్దాం. ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 7 నుండి 21 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఆగస్టు 22న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. ఆగస్టు 25 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. అదే రోజు రాత్రి ఫలితాలు ప్రకటిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ మరియు రాజ్యసభ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాష్ట్రాల శాసనసభ సభ్యులకు ఓటు హక్కు ఉండదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com