Vijay Party : ఎన్డీఏలోకి విజయ్ పార్టీ!?

Vijay Party : ఎన్డీఏలోకి విజయ్ పార్టీ!?
X

తమిళనాడులోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న బీజేపీ ఈ సారి సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్టి కళగం (టీవీకే) పార్టీతో కలిసి ఎన్నికలకు బరిలోకి దిగే చాన్స్ ఉందనే ఊహగానాలకు తెరలేచింది. నిన్న కేంద్ర ప్రభుత్వం విజయ్ కి వై సెక్యూరిటీ భద్రతను కేటాయించింది. సాధారణంగా ముప్పు పొంచి ఉందని భావించిన వారికి మాత్రమే వై కేటగిరి భద్రత అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు అన్నా డీఎంకే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది. తమిళనాడులో ఒంటరి పోరుతో కష్టమని భావిస్తున్న బీజేపీ.. కొత్త సమీకరణాలకు తెరలేపి నట్టు వార్తలు వస్తున్నాయి.

ఓ వైపు విజయ్ పార్టీ అన్నా డీఎంకే పొత్తు కోసం చర్చలు జరుపుతున్న సమయంలో అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అన్నాడీఎంకే డిప్యూటీ సె క్రటరీ మనుస్వామి స్పందిస్తూ.. వైప్లస్ కేటగిరి భద్రత కల్పించడం చూస్తుంటే ఎన్డీఏలో చేర్చు కునేందుకు ఎరవేస్తున్నట్టుగా కనిపిస్తోందన్నా రు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం ముందు చోటు చేసుకున్న ఈ పరి ణామంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్ని కల్లో టీవీకే, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది.

విజయ్ గత ఏడాది ఆగస్టులో పార్టీ జెండా ఎజెండాను ప్రకటించారు. చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో విజయ్ ఈ జెండాను ఎగురవేశారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై మధ్యలో వాగాయి పువ్వుకు రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి. తర్వాత అక్టోబర్ లో విల్లుపురంలో నిర్వహించిన సభకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వే నిర్వహించి టీవీకే కు 15% ఓటు బ్యాంకు ఉందని, దానిని పెంచు కోవాలని పలు సూచనలు చేశారు. టీవీకేతో జతకట్టడం ద్వార తమిళనాడుకు ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న బీజేపీ ఎన్డీఏలో చేర్చుకు నేందుకే వై కేటగిరి భద్రత కేటాయించిందనే చర్చ మొదలైంది.

Tags

Next Story