Vijay : అక్టోబర్ 27న విజయ్ తొలి సభ

Vijay : అక్టోబర్ 27న విజయ్ తొలి సభ
X

అభిమానులు, తమిళగ వెట్రీ కళగం(టీవీకే) దళపతి విజయ్ శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కీలక ప్రకటన విడుదల చేశారు. తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహా నాడు అక్టోబర్ 27వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23న విక్రవాండిలో ఈ మహా నాడును నిర్వహించేందుకు పోలీసుల అనుమతి లభించినప్పటికీ దాని నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టలేదు. దీంతో మహానాడు తేదీని విజయ్ వాయిదా వేశారు.

తాజాగా కొత్త తేదీని విజయ్ ప్రకటించారు. ఈ సమావేశంలోనే పార్టీ సిద్ధాంతాన్ని ప్రక టిస్తారని సమాచారం. అభిమానులు, పార్టీ కార్య కర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజయ్ కోరారు. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం పేరుతో అట్టహాసంగా రాజకీయ పార్టీని ప్రారంభించి రాజకీయ ప్రవేశం చేసిన విజయ్ ఆగస్టు 22న పార్టీ పతాకాన్ని కూడా ఆవిష్కరించారు.

Tags

Next Story